Hyderabad, Hyderabad Best City, Hyderabad India Best City, Hyderabad Top Best City, Hyderabad World Best City, Hyderabad Global Best Cityఇండియాలో ముంబై, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు… ఇలా ప్రతిష్టాత్మక నగరాల జాబితా చాలానే ఉంది. అయితే వీటన్నింటినీ కాదని హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను పరిశీలిస్తే… భాగ్యనగరం హైదరాబాద్ కే అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ మేరకు గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ కన్ సల్టింగ్ సంస్థ ‘మెర్సర్’ విడుదల చేసిన జాబితాలో హైదరాబాద్ అన్ని భారతీయ నగరాల కంటే కూడా అగ్రస్థానంలో నిలిచింది.

ప్రపంచంలోని 230 నగరాలతో కూడిన ఈ జాబితాలో అయితే హైదరాబాద్ కు 139వ స్థానం దక్కింది. ఆయా నగరాల్లో నివాసయోగ్యతకు సంబంధించిన 39 అంశాలను పరిగణలోని తీసుకున్న ‘మెర్సర్’ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచిన భారతీయ నగరాల విషయానికొస్తే… 144వ స్థానంలో పుణే నిలిచింది. ఆ తర్వాత బెంగళూరు (145), చెన్నై (150), ముంబై (152), కోల్ కతా (160), ఢిల్లీ (161) స్థానాల్లో ఉన్నాయి.

39 అంశాలను పరిగణనలోకి తీసుకున్న మెర్సర్… ఓ పది విభాగాలుగా కూర్చి సర్వే చేసిందట. వీటిలో రాజకీయ – సామాజిక వాతావరణం, రాజకీయ- సాంస్కృతిక, వైద్య, ఆరోగ్య సేవల లభ్యత, విద్యావకాశాలు, పౌర సేవలు, రవాణా, వినోదం, వినియోగ వస్తువులు, గృహ నిర్మాణం, సహజ వాతావరణం తదితరాలు ఉన్నాయి. మరి వీటన్నింటికి అడ్డా అయిన హైదరాబాద్ అగ్ర స్థానం కైవసం చేసుకోవడం తెలుగు వారికి గర్వకారణమే.