Hyderabad Coronavirus cases increasingఆదివారం విడుదలైన బులెటిన్ ప్రకారం తెలంగాణలో ఒక్క రోజే 199 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసి ఏరియాలోనే 122 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాజధాని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో రాజధాని ప్రాంతంలో జనజీవనం సాధారణ స్థాయికి చేరుకుంటుంది.

పలుచోట్ల ట్రాఫిక్ జాములు కూడా జరుగుతున్నాయి. దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు తన రోజువారీ పనులలో బిజీ అవుతున్నారు. ఈ తరుణంలో కేసులు పెరగడంపై ఆందోళన ఎక్కువ అవుతుంది. ఈ నిబంధనల సడలింపు మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ కు దారితీస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

గడచిన ఐదు రోజులలో తెలంగాణలో ఏడు వందల కేసులు నమోదు అయ్యాయి. రాజధాని ఏరియా తెలంగాణకే ఆయువుపట్టు. ఇప్పటికీ తెలంగాణ ఆర్ధిక పరిస్థితి హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉంది. ఇటువంటి తరుణంలో ఈ పరిణామం ఏ మాత్రం మంచిది కాదు.

దేశంలో రోజుకు 8,000కు పైగా కేసులు నమోదు అవుతుంది. ఒకటి రెండు రోజులలో రెండు లక్షల కేసుల మార్కును దాటే అవకాశం ఉంది. జూన్ 8 నాటికి 90% లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తుంది ప్రభుత్వం. అలాగే జులై – ఆగస్టు నాటికి లాక్ డౌన్ కు ముందు స్థితి రాబోతుంది. కనుచూపు మేరలో ఈ విపత్తుకు పరిష్కారం కనిపించడం లేదు.