Etala Rajender-Huzurabad-By Electionsహుజురాబాద్ ఉపఎన్నిక….తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈటల రాజీనామా చేసిన మొదలు..మంగళవారం ఉపఎన్నిక రిజల్ట్ వెలువడే వరకు నరాలు తెగే ఉత్కంఠత. మొత్తానికి ఈటల భారీ విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఆర్ఆర్ఆర్. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి చెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాకు ఆర్ఆర్ఆర్ పేరును పెట్టడం…దాన్ని పోలుస్తూ…ఆర్ పేరుతో ఉన్న ఏదైనా ఆర్ఆర్ఆర్ లోకి తీసుకొచ్చేస్తున్నారు జనం.

ఈ ఆర్ఆర్ఆర్ పదానికి ఉన్న జనాదరణ అంతాఇంతా కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ బరిలోకి దిగటం…బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భం…ఆయన విజయం సాధించగా…బీజేపీకి ఇప్పటికే రాజాసింగ్, రఘునందన్ రావు ఉన్నారు. మరో ఆర్ అక్షరంతో మొదలయ్యే రాజేందర్ రాకతో…తెలంగాణ అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ ఆవిష్క్రుతం అవుతుందన్న మాట పలువురి నోటి వెంట వినిపిస్తోంది. ఈటల రాజేందర్ లాంటి ఫైర్ బ్రాండ్ ను ఇప్పటివరకు టీఆరెస్ నేతగా చూశారు. సుదీర్ఘకాలంగా టీఆరెస్ పార్టీ తరపున గొంతుక వినిపించిన ఈటల…రానున్న రోజుల్లో కేసీఆర్ మీద కట్టినట్లు మాట్లాడే సందర్భం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ సాధ్యమవుతుందా లేదా అన్న సందేహం పక్కనపెడితే….సూపర్ డూపర్ హిట్ అనే రీతిలో విజయం సాధించిన వేళ…పొలిటికల్ ఆర్ఆర్ఆర్ అదిపోయిందనే చెప్పాలి. ఇక మిగిలింది రీల్ ఆర్ఆర్ఆర్. దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ లతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. థియేటర్లలోకి వచ్చి సినిమాలు చూస్తేందుకు ప్రేక్షకులు జంకుతున్నారు. ఈనేపథ్యంలో జనవరి 7, 2022న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ను ఇవ్వబోతుందన్నది ఆసక్తిగా మారింది.