Mohenjo Daro, Mohenjo Daro Disaster, Mohenjo Daro Movie Disaster, Hrithik Roshan Mohenjo Daro Disaster, Mohenjo Daro Biggest Disaster, Bollywood Mohenjo Daro Disasterఆగష్టు 12న సినిమా విడుదల అని డేట్ ఇవ్వగానే ఒక రకంగా… అదే తేదీకి ఫిక్స్ అయిన ‘జనతా గ్యారేజ్’ యూనిట్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్న పరిస్థితి. అంతటి భారీ అంచనాలు నెలకొన్న హృతిక్ రోషన్ “మొహెంజోదరో” ఓపెనింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలు భయపడుతున్నారు. డిజాస్టర్ అని చెప్పడానికి కూడా భయపడే విధంగా ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఉండడం ట్రేడ్ వర్గాలను అవాక్కు చేసింది.

100 కోట్లు పైనే బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా షుమారు 2700 స్క్రీన్లలో విడుదలై, తొలి రోజు కేవలం 8.87 కోట్లను మాత్రమే కొల్లగొట్టింది. హృతిక్ కెరీర్ లో ఇప్పటివరకు భారీ డిజాస్టర్ గా మిగిలిన ‘కైట్స్’ సినిమా కూడా 10 కోట్లు పైనే వసూలు చేసింది. ‘కైట్స్’ కేవలం 1800 స్క్రీన్లలో మాత్రమే విడుదలై 10 కోట్లకు పైనే వసూలు చేయగా, ‘బాహుబలి’ రికార్డులు కొట్టేస్తుందన్న అంచనాలతో విడుదలై, కనీస ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేక చతికిలపడం శోచనీయమైన అంశమే.

జాతీయ వ్యాప్తంగా విడుదలైన “మొహెంజోదరో” కంటే కూడా తెలుగులో మాత్రమే విడుదలైన విక్టరీ వెంకటేష్ ‘బాబు బంగారం’ ఓపెనింగ్స్ దీని కంటే మెరుగని చెప్పక తప్పదు. ఏపీ, తెలంగాణాలలో కలిపి “బాబు బంగారం” దాదాపు 5.51 కోట్లు వసూలు చేయడం విశేషం. మరి హృతిక్ రోషన్ మార్కెట్ అంతా ఏమైందో లేక సినిమా ఫలితం ముందుగానే ప్రేక్షకులకు అర్ధమైందో గానీ “మొహెంజోదరో” కలెక్షన్స్ పట్ల బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.