how-will-nithin-use-pawan-kalyan-for-new-movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై హీరో నితిన్ చూపించే అభిమానం ప్రధానంగా ఆయా సినిమాల ప్రచారానికి మరియు చిత్ర ఓపెనింగ్స్ కు కారమవుతున్నయన్న విషయం తెలిసిందే. పవన్ ప్రస్తావన లేకుండా ఇటీవల కాలంలో నితిన్ సినిమా ముగియడం లేదు. అది పాట రూపంలో గానీ, సన్నివేశాల రూపంలో గానీ లేదా డైరెక్టర్ రూపంలో గానీ ‘పవన్ కళ్యాణ్’ సెంటిమెంట్ లేకుండా నితిన్ సినిమా ఒప్పుకోవడం లేదనే దాకా ఈ ప్రచారం వెళ్లిందంటే, ఏ మేరకు పవర్ స్టార్ ప్రభావం నితిన్ పై పడిందో అర్ధం చేసుకోవచ్చు.

మరి తాజాగా తానొక సినిమాకు కమిట్ అయ్యానంటూ నితిన్ ట్వీట్ చేసారు. ఈ ఏడాది తొలి హిట్ గా నమోదైన “నేను.. శైలజ…” సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నితిన్ ట్వీట్ చేసారు. ఈ సినిమా శ్రేష్ట మూవీస్ పతాకంపై నిర్మితమవుతుందని, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తానని సమాచారమిచ్చాడు నితిన్.

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఏ రకంగానూ పవన్ అంశం ప్రామాణికంగా వినపడడం లేదని సినీ వర్గాల టాక్. సాధారణంగా పవన్ సినిమాల దర్శకులను ఎంపిక చేసుకుంటున్న నితిన్ ఈ సారి రామ్ కు బ్రేక్ ఇచ్చిన కిషోర్ తిరుమలను ఎంచుకోవడం విశేషం. ఇప్పటికీ పవన్ ప్రస్తావన లేకపోయినా సినిమా చివరి దశకు చేరుకునే సమయానికి పవన్ రంగంలోకి ఖాయమే అంటున్నారు అభిమాన వర్గాలు.