మర్యాద ఎలా సంపాదించుకోవాలి? జగన్ నీకర్థమవుతుందా?అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన నాటి నుండీ తనకు సినిమా ఇండస్ట్రీ ముఖ్యుల నుండి సరైన మర్యాద రావడం లేదని జగన్ మోహన్ రెడ్డి కంప్లైంట్ అని పదే పదే వినిపిస్తుంది. ఆ తరువాత ఈ ఏడాదిలో వచ్చిన వకీల్ సాబ్ నాటి నుండీ టిక్కెట్ రేట్ల విషయంలో నొక్కి ప్రభుత్వం తన పవర్ ఏంటో చూపించింది.

ప్రభుత్వం ఇటీవలే తెచ్చిన జీవో అమలు చేస్తే బీ, సీ సెంటర్లలో కనీసం విద్యుత్తు ఛార్జీల కూడా రావని పరిశ్రమ మొత్తం గగ్గోలు పెడుతుంది. దానితో ఎప్పుడో తెరుచుకోవాల్సిన థియేటర్లు ఇంకా మూతబడే ఉన్నాయి. అయితే దీని గురించి మాట్లాడదాం అంటే కనీసం ఇండస్ట్రీ పెద్దలకు అప్పాయింట్మెంట్ కూడా దక్కని పరిస్థితి.

మరోవైపు తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితి… అక్కడ పరిశ్రమకు ఏదైనా సమస్య వచ్చినా కేసీఆర్ దొరక్కపోయినా మంత్రి తలసాని ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. మొన్నా మధ్య ఆయనను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వారు కలిసి తమ సమస్యల చిట్టా వినిపించారు.

మొత్తం లిస్టులో ప్రభుత్వం మీద భారం పడని ఒకటి మాత్రం క్లియర్ చేసి ఈరోజు తలసాని సన్మానం చేయించుకున్నారు. మరోవైపు… ఏపీలో కనీసం అప్పాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ వైఖరి మీద దర్శకుడు దేవ కట్టా వంటి వారు స్పందించడం మొదలుపెట్టారు. ఇంకా మండితే మిగతా వాళ్ళు కూడా బాహాటంగా విమర్శిస్తారు.

అప్పుడు అనవసరమైన లొల్లి. మర్యాద ఎలా సంపాదించుకోవాలి? అనే దాని పై జగన్ కు క్లారిటీ లేదేమో. అయితే ఇప్పుడు అనుసరిస్తున్న పద్దతి మాత్రం కాదు.