How Jagan government is ending Amaravatiపత్రికలు భూత, వర్తమాన చరిత్రలకు అద్దం పడుతూ భవిష్యత్‌ ఏవిదంగా ఉండబోతుందో కాస్త అటూ ఇటూగానైనా ఊహించి చెపుతుంటాయి. కానీ ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ, సమాజ హితవు కోసం చెప్పే నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. కానీ ఎవరికో నచ్చనంతమాత్రన్న వాటి గుణాలు కోల్పోవు. అందుకే చేదు నిజాలు అంటారు. ఈ నెల 8వ తేదీ మిర్చి9తెలుగులో ‘మళ్ళీ ఎవరూ ప్రాణం పోయకుండా అమరావతి హత్య’ అనే శీర్షికతో అమరావతి వైసీపీ ప్రభుత్వం ఏవిదంగా చంపేస్తోందో వ్రాయడం జరిగింది.

ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు కూడా అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తూ ఈరోజు (సెప్టెంబర్‌ 19న) ‘అమరావతి అంతమే అజెండా’ అనే శీర్షికతో మరింత వివరంగా జగన్ ప్రభుత్వం అమరావతిని ఏవిదంగా అంతం చేస్తోందో వివరించింది. ఆ వివరాలు క్లుప్తంగా మీ కోసం..

· అమరావతి నిర్మాణానికి 1.10 లక్షల కోట్లు, వందేళ్ళ సమయం పడుతుందని, అంత డబ్బు రాజధానిపై పెట్టేస్తే రాష్ట్రంలో మిగిలిన జిల్లాలు అన్యాయం అయిపోతాయని జగన్ చెప్పారు. కానీ దానిలో రూ.55,343 కోట్లు 5 ఏళ్ళ వ్యవధిలో పెట్టి మిగిలిన రూ.54 వేల కోట్లు దీర్గకాలంలో ప్రైవేట్ ప్రాజెక్టులలో పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ వాటిలో అవే ఎక్కువ శాతం పెట్టుబడులు పెడతాయి.

· ఏ రాష్ట్రానికైనా తప్పనిసరిగా సచివాలయం, శాసనసభ, హైకోర్టు చాలా అవసరం. కనుక టిడిపి ప్రభుత్వం ముందుగా వాటినే నిర్మించింది. రాజధానిలో కట్టడాలన్నీ పూర్తయ్యేవరకు వాటి నుంచే పరిపాలన సాగుతుంటుంది. కనుక వాటిని పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన భవనాలుగానే చూడాలి. ఒకవేళ జగన్ ప్రభుత్వం చెప్పినట్లు రాజధాని కట్టడానికి వందేళ్ళు పడితే వందేళ్ళు వాటి నుంచే పరిపాలన సాగుతుంది. కానీ అవన్నీ తాత్కాలిక కట్టడాలని తప్పుడు ప్రచారం చేస్తున్న జగన్ ప్రభుత్వం వాటిలోనే పరిపాలన చేస్తోంది.

· రాజధాని తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. భూములిచ్చిన రైతులలో ఎస్సీ, ఎస్టీలు 32%, రెడ్లు 23%, కమ్మ 18%, బీసీలు 14%, కాపులు 9%, మైనార్టీలు 3%, ఇతరులు 1% ఉన్నారు. మరి అమరావతిపై కమ్మకులం ముద్ర ఎలా వేయగలరు?

· అమరావతి ఖచ్చితంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే. ఒప్పందాల ప్రకారం 1,691 ఎకరాలు పోగా ఇంకా 8,274 సీఆర్‌డీఏ చేతిలో ఉంటాయి. దానిలో 3,254 ఎకరాలను భవిష్య అవసరాలకు రిజర్వ్ చేసింది. మిగిలిన భూములను రాబోయే 18 ఏళ్ళలో నిధుల సమీకరణకు దశలవారీగా అమ్ముకొంటే సుమారు రూ.1,71,533 కోట్లు వస్తాయి. అంటే అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువే సీఆర్‌డీఏ చేతిలో ఇధులు ఉంటాయన్న మాట.

· అమరావతి ని విజయవాడ, గుంటూరుతో కలపడానికి రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని జగన్ వాదన. కానీ ఉండవల్లి నుంచి కృష్ణనదిపై వంతెన నిర్మిస్తే 5 నిమిషాలలో విజయవాడ నుంచి రాజధాని కేంద్రానికి చేరుకోవచ్చు. నిజానికి రాజధాని నిర్మించిన తర్వాత అది నిరంతరంగా చుట్టుపక్కలకు విస్తరిస్తూనే ఉంటుంది. అందుకే రాజధాని ప్లానులో అవుటర్, ఇన్నర్ రింగు రోడ్డులను ప్రతిపాదించిందని వైసీపీకి తెలుసు. అందుకే దానిని ముందే పక్కన పెట్టేసి వితండ వాదన చేస్తోంది.

· రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ, ప్లాన్లు, డిజైన్లు, అనుమతులు, నిధుల సమీకరణ, న్యాయపరమైన సమస్యలు వంటివి రాత్రికి రాత్రి పూర్తయ్యేవి కావు. అవన్నీ పూర్తిచేసుకొన్నాక రాజధాని నగరంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, నిర్మాణాల విలువ రూ.10,000 కోట్లు పైమాటే!

· అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన భవనాలను వాడుకొంటూ, లీజుకి ఇచ్చుకొని నిధులు సమకూర్చుకొంటూ గ్రాఫిక్స్ అనడం సిగ్గుచేటు. రాజధానిలో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు జరిగాయి.

· గత ప్రభుత్వం రూ.215 కోట్ల వ్యయంతో 18కిమీ పొడవైన రాజమార్గంలాంటి సీడ్ యాక్సస్ రోడ్డు నిర్మించింది. మరో 4కిమీ పని పూర్తి చేస్తే చాలు ప్రకాశం బ్యారేజి నుంచి రాజధానికి సువిశాలమైన రోడ్డు ఏర్పడుతుంది. కానీ జగన్ ప్రభుత్వం దానిని పూర్తిచేయకుండా పక్కనే కరకట్ట రోడ్డు నిర్మించడానికి శంకుస్థాపన చేసింది కానీ దానినీ ఇంతవరకు పూర్తిచేయలేకపోయింది.

· అన్ని విధాలుగా ఎదిగిన విశాఖ నగరంలో ఎలాగూ పెట్టుబడులు వస్తాయి. దాంతో పాటే అమరావతిలో కూడా పెడితే రాష్ట్రంలో రెండు బలమైన నగరాలు ఏర్పడతాయి కదా?

· ఇన్ని వేల కోట్ల ఖర్చు చేసి అమరావతిలో చేసిన నిర్మాణాలను పాడుపెట్టి జగన్ ప్రభుత్వం విశాఖలో రాజధాని ఏర్పాటు చేసేందుకు వేలకోట్లు ఖర్చు చేయడం విజ్ఞత అనిపించుకొంటుందా?

· ఒకవేళ వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వేరే పార్టీ వచ్చి విశాఖలో రాజధాని వద్దంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?

· ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిచేయకుండా ఇలాగే మద్యలో ఆపేసి మళ్ళీ కొత్తగా మొదలుపెడితుంటే చివరికి ఏమవుతుంది?

· ప్రభుత్వ విధానాలలో స్థిరత్వం లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు వస్తాయి? రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందుతుంది? ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది?

Exclusive Video Interviews: Watch & Subscribe