How How Sivaji knows about CBI notticesవారం రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, వచ్చే సోమవారం నాడు చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు నోటీసులు జారీ కానున్నాయని, ఈ విషయం ఇప్పుడు నేను బయటపెట్టాను కాబట్టి, ఒకటి, రెండు రోజులు ఆలస్యం అవుతుందేమో గానీ, నోటీసులు రావడం మాత్రం పక్కా అని బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదంతా ‘ఆపరేషన్ గరుడ’లో భాగమేనని, సమయానుకూలంగా అది పలు రూపాలు మార్చుకుంటోందని అన్నారు.

కట్ చేస్తే… గురువారం నాడు సాయంత్రం నాటికి శివాజీ చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’లో ఒక అంశం నిజమైంది. దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ కో చేసిన ఉద్యమానికి, నేడు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం విశేషం. ఈ నెల 21వ తేదీ లోగా కోర్టుకు హాజరు కావాలని వచ్చిన ఈ నోటీసులు ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందంటూ టిడిపి వర్గాలు మండిపడుతున్నాయి.

అయితే అధికారంలో ఉన్న టిడిపి వర్గాలకు కాకుండా శివాజీకి ఈ సమాచారం అంతా ఎలా తెలుస్తోంది? అన్నది మాత్రం మిస్టరీగా మారింది. టిడిపి వర్గీయులే ఈ సమాచారాన్ని అంతా శివాజీకి చెప్పి మీడియా చేత చెప్పిస్తున్నారా? లేక ఓ సీక్రెట్ మిషన్ లా శివాజీ ఏమైనా పని చేస్తున్నారా? ఏది ఏమైనా శివాజీ నోట వస్తోన్న వ్యాఖ్యలు కార్యరూపం సిద్ధించుకోవడంతో, మున్ముందు శివాజీ ఏం విషయాలు చెప్తారు? అన్న అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్యుల్లోనూ నెలకొంది.