Decentrlisation without development in state3 రాజధానుల బిల్లును ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంటున్నా, మెరుగైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తామని, అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటూ అధికార ప్రభుత్వం వైసీపీ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

అసెంబ్లీలో జగన్ చేసిన ఈ వివరణ తర్వాత అనేక రాజకీయ విశ్లేషణలు బయటకు వచ్చాయి. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో అసలేం జరిగింది? నేడు జగన్ సర్కార్ గత రెండున్నర్రేళ్ళుగా ఏం చేస్తోంది? అన్న అంశాలు హైలైట్ అయ్యాయి. ఇందులో భాగంగా జరుగుతున్న చర్చలలో వైసీపీ ఓ స్థాయిలో కార్నర్ అవుతోంది.

అసలు ‘అభివృద్ధి’ అనేదే లేకుండా ‘వికేంద్రీకరణ’ అన్న మాట ఎక్కడ నుండి వస్తుంది అంటూ ప్రశ్నించడం నెటిజన్ల వంతవుతోంది. ఇందుకు నిదర్శనంగా గత రెండున్నర్రేళ్ళ వైసీపీ పాలన అద్దం పడుతుందనేది అసలు లాజిక్.

రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతం గానీ, అలాగే అన్ని ప్రాంతాలలో గానీ ‘అభివృద్ధి’ అన్న పదానికి ఆమడ దూరంలో అధికార పార్టీ పాలన ఉంటోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు అదే సామాన్యులలో కూడా చర్చకు దారి తీసింది. దీంతో వైసీపీ సర్కార్ చెప్తోన్న ‘వికేంద్రీకరణ’ కామెడీగా మారిపోయింది.

అభివృద్ధి చేసిన తర్వాత చెప్పాల్సిన మాటలను, చేయకుండానే చెప్తే జనాలు కామెడీగా కాక ఎలా తీసుకుంటారులెండి! అది కూడా అయిదేళ్ల పాలనలో సగం రోజులు ఇప్పటికే గడిచిపోయిన తర్వాత ప్రస్తావించడం మరింత హాస్యాస్పదంగా మారిందనేది అసలు విషయం. సీరియస్ గా పరిగణించాల్సిన ‘వికేంద్రీకరణ’ వైసీపీ పుణ్యమా అంటూ ‘కామెడీ’గా మారిపోయింది.