What Message Did Jagan Give With These Key Appointments?జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. కావాల్సిన స్థలాల సేకరణ పూర్తి కాకపోవడంతో వాయిదా వేసి, ప్రభుత్వం తెలివిగా ఆ నెపం టీడీపీ మీద నెట్టడం గమనార్హం. ఇళ్ల పట్టాలపై టీడీపీ కోర్టుకు వెళ్లడం వల్లే కార్యక్రమం వాయిదా పడిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

ఏపీలో ఉన్న 20 శాతం మంది జనాభాకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు వివరించారు. ఇళ్ల పట్టాల కోసం 62 వేల ఎకరాలు సేకరించామన్నారు. ప్రైవేట్‌ భూముల కొనుగోలుకే రూ.7,500 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షం వల్లే 30 లక్షల కుటుంబాలకు సొంత ఇళ్ళు వచ్చే అవకాశం వాయిదా పడిందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

సరే ఆ విషయం పక్కన పెడితే… గత ప్రభుత్వంలో పూర్తయిన, దాదాపు పూర్తైన నాలుగు లక్షల ఇళ్ళు ఏడాదికి పైగా ఖాళీగా ఉంచింది ఈ ప్రభుత్వం. ఈ ఇళ్ళ పంపిణీ కి లబ్ధిదారుల లాటరి కూడా పూర్తి అయ్యింది. అయినా లబ్దిదారులకు తమ సొంత ఇంటి కల నెరవేరలేదు.

టీడీపీ హయాంలో నిర్మించిన ఈ ఇళ్ళు ఇప్పుడు పంచి పెడితే ఎక్కడ ఆ పార్టీకి రాజకీయంగా కలిసి వస్తుందో అనే అనుమానంతోనే వాటిని పక్కన పెట్టేశారని టీడీపీ వారి ఆరోపణ. నిత్యం పేదల సంక్షేమ కోసం పరితపిస్తున్నాం అని చెప్పుకునే ప్రభుత్వం తమకు రాజకీయ లబ్ది కంటే వారి సంక్షేమం ముఖ్యం అని నిరూపించుకోవడానికైనా ఈ ఇళ్ళ పంపిణీ చెయ్యాల్సి ఉంది.