honey rose and rachana narayanankutty to support bhavana-దక్షిణాది హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మళయాల మూవీ ఆర్టిస్ట్స్) సభ్యులుగా ఉన్న హీరోయిన్లు హనీ రోజ్, రచనా నారాయణ కుట్టీలు కేరళ హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ… ఈ కేసులో వాదనలు వినేందుకు మహిళా న్యాయమూర్తినే నియమించాలని కోరారు.

ఇదే సమయంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ సైతం ఓ పిటిషన్ ను దాఖలు చేయడంతో, రెండు పిటిషన్లనూ కోర్టు విచారణకు స్వీకరించింది. మాలీవుడ్ లో కలకలం రేపిన భావన వేధింపుల కేసులో మహిళా న్యాయమూర్తిని నియమిస్తామన్న కేరళ సర్కారు, ఇంతవరకూ ఆ పని చేయలేదు.

ఇటీవలే దిలీప్ పై విధించిన నిషేధాన్ని సైతం ‘అమ్మ’ తొలగించింది. ఈ నేపథ్యంలో మహిళా జడ్జి అయితేనే విచారణ పారదర్శకంగా సాగి, సత్వర న్యాయం జరుగుతుందని హనీ రోజ్, రచనలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. మరి ఈ ఇద్దరి హీరోయిన్ల విజ్ఞప్తిని కోర్టు అంగీకరిస్తుందో లేదో గానీ ఈ కేసు విచారణలో భావన తరపు వర్గం పూర్తి అసంతృప్తితో నిండి ఉంది.