Home misinter-Mekathoti-Sucharitha- (2)
అమరావతికి అనుకూలంగా జరిగే పోరాటాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా వేదికగా హోమ్ మంత్రి సుచరిత ఇచ్చాను అని చెబుతున్న ఆదేశాలు ఇందుకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఈ ఆదేశాలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.

“భూముల ధరల కోసం అమాయకపు ప్రజలను వాడుకోకండి, అభివృద్ధి కేవలం ఒక ప్రాంతానికి సొంతం కాదు, అమరావతి, తుళ్లూరు, నీరుకొండ, ప్రాంతాలలో గొడవలు చేసిన, అధికారులను గాయపరిచినా, వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది,” ఇక్కడి వరకు బానే ఉంది. అయితే ఆ తరువాత మంత్రిగారు చెప్పినదే వివాదాస్పదం అయ్యింది.

“ఎస్ఆర్ఎం, వీఐటీ యూనివర్సిటీలలో చదివే విద్యార్థులు అమరావతి రాజధాని గొడవలకి వెళ్లకుండా ఆ విద్యాసంస్థలు వారిని హెచ్చరించాలని ఆదేశిస్తున్నా. వీటిని అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సింది గా పోలీసు అధికారులకు ఆదేశిస్తున్నాం. వీటికి సహకరించి ప్రజలు అంతా జవాబుదారీతనం తో వ్యవహరించాల్సింది గా కోరుతున్నా,” అని సుచరిత పిలుపిచ్చారు.

దీనిపై ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. “నిరసన తెలపడం అందరి హక్కులు. రాజ్యాంగం కలిపించిన హక్కుని ప్రభుత్వం ఎలా కాలరాస్తుంది? ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ అధికారం ఉంది? తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమం చేసింది విద్యార్థులు కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ కు విద్యార్థి సంఘాలు ఎందుకు ఉన్నట్టు? విద్యాలయ యాజమాన్యాలను అడ్డం పెట్టుకుని ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు,” అని వారు హెచ్చరిస్తున్నారు.