కింగ్ నాగార్జున ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. ఆయన మొన్నటి సినిమా మన్మథుడు 2 భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కొంత బ్రేక్ తీసుకున్న నాగార్జున తన తరువాతి సినిమా కోసం ఒక కొత్త యువకుడి కథని ఒకే చేశారట. గతంలో మహర్షి, ఊపిరి సినిమాల స్టోరీ డిపార్టుమెంటు లో పని చేసిన సోలమన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారబోతున్నాడు.

తొందరలోనే ఈ సినిమా మొదలు కాబోతుంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ చిత్రం ఒక కీలకమైన పోలీసు ఆపరేషన్ సీన్ ఉంటుందట. దానిని భారీ ఎత్తున షూట్ చెయ్యబోతున్నారట. దానికోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్లను తీసుకుని వచ్చారట. వారు ప్రస్తుతం ఈ సీన్ కోసం ఒక వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేశారు.

చాలా కాలం తరువాత నాగార్జున ఈ సినిమా కోసం ఖాకీ వెయ్యబోతున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున పక్కన హీరోయిన్ గా ఎవరు కనిపించేది ఇంకా తెలియాల్సి ఉంది.

సీనియర్ సంగీత దర్శకుడు మణి శర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ కొట్టిన మణి శర్మకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న నాగార్జునకు ఈ సినిమాతోనైనా హిట్ దక్కుతుందేమో చూడాలి.