hollywood stunt director for Varun tej movieసినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్న ఈ యంగ్ హీరో బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొత్త కుర్రాడు కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఇప్పుడు ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇవ్వబోతున్నారు ఆ మూవీ టీం.

ఈ సినిమాలో యాక్ష‌న్ ఎలిమెంట్స్ చాలా కీలకంగా ఉండ‌నుండ‌నున్నాయ‌ట‌. అందుక‌ని హాలీవుడ్ యాక్ష‌న్ మాస్ట‌ర్ లార్నెల్ స్టోవాల్‌తో ఈ సినిమా యాక్ష‌న్ సన్నివేశాల‌ను చేయించ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. కెప్టెన్ అమెరికా, సివిల్ వార్ వంటి ప‌లు హాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేసిన స్టోవాల్ బాలీవుడ్‌లో సుల్తాన్ చిత్రానికి యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేశారు.

ఇప్పుడు వ‌రుణ్ సినిమాకు ప‌నిచేయ‌బోతున్నార‌ని టాక్‌. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటివరకూ ఈ సినిమాకు హీరోయిన్ కంఫర్మ్ కాలేదు. వారానికి ఒక హీరోయిన్ పేరు వినపడుతుంది. తాజాగా వినపడుతున్న పేరు … దబాంగ్ 3 తో సినిమాలకు పరిచయమైన శాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నారట.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వరుణ్ నటించబోతున్న పదో సినిమా ఇది. గద్దలకొండ గణేష్ సినిమాలో ఊర మాస్‌గా కనిపించిన వరుణ్ ఇప్పుడు బాక్సర్‌గా ఎలా ఉంటారో చూడాలి. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సినిమాకు సంగీతం అందిస్తారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రిపాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది.