Vijay Deverakonda Back With Geetha Govindam Magicఇండస్ట్రీలో ఒక హీరో వద్దనుకున్న కథనో లేదా దర్శకుడినో మరొకరు ఓకే చేసి హిట్టు కొట్టడం లేదా ఫ్లాప్ అందుకోవడం చాలా సార్లు జరిగింది. అతడు విషయంలో పవన్ త్రివిక్రమ్ ఇప్పటికీ గొడవ పడుతున్నారని ఇటీవలే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో రివీల్ అయ్యింది. ఇడియట్, అమ్మ అన్న ఓ తమిళ అమ్మాయిలను పూరి జగన్నాధ్ రాసుకుంది పవన్ కోసమే. ఆంధ్రావాలాకు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఆప్షన్ కాదు. చిరంజీవికి ముందు వినిపించారని అప్పటి మీడియాలో వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

విజయ్ దేవరకొండ తాజాగా పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లో అఫీషియల్ గా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గీత గోవిందం కాంబినేషన్ కాబట్టి సహజంగానే మంచి అంచనాలు ఉంటాయి. అయితే పరశురామ్ ముందు నాగ చైతన్యతో చేయాల్సింది. కానీ స్క్రిప్ట్ తో అక్కినేని హీరోని మెప్పించలేకపోయాడు. నిజానికి సర్కారు వారి పాట కనక రిలీజ్ కు ముందు ఊరించిన రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యుంటే టయర్ 1 స్టార్లే పిలిచి మరీ చేసేవాళ్ళు. యావరేజ్ కంటెంట్ తో ఏదో మహేష్ బాబు నెట్టుకొచ్చాడు కాబట్టి సరిపోయింది

ఇప్పుడు రౌడీ హీరోని పట్టేసుకున్నాడు. గీత గోవిందం 2 అనే ప్రచారం ఉంది కానీ ఇది వేరే ఫ్రెష్ కథ. సరే జానర్ ఏంటి, బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుంది అవన్నీ తర్వాత తెలిసే విషయాలు. దీని కన్నా ముందు గౌతమ్ తిన్ననూరికి ఎస్ చెప్పిన విజయ్ దేవరకొండ అతను కూడా రామ్ చరణ్ తో నో చెప్పించుకుని వచ్చిన సంగతి తెలియకేం కాదు. పైగా ఇప్పటిదాకా సాఫ్ట్ ఎమోషనల్ సబ్జెక్ట్స్ మాత్రమే డీల్ చేసిన గౌతమ్ పోలీస్ యాక్షన్ డ్రామాని ఎలా డీల్ చేస్తాడోననే అనుమానం లేకపోలేదు. సితార బ్యానర్ కాబట్టి ఎక్కువ ఆలోచించలేదేమో

లైగర్ గాయం ఎప్పుడు మానుతుందాని ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఖుషి హిట్ కావడం చాలా అవసరం. అదేమో సమంతా కోసం వాయిదా పడుతూనే ఉంది. తిరిగి వచ్చాక కూడా సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్ళింది కానీ ఇక్కడికి రాలేదు. సరే ఇవన్నీ పక్కనపెడితే డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఇలా వరసగా డిజాస్టర్ల రుచి చూసిన విజయ్ కు వీటిలో ఏ రెండు హిట్ అయినా మార్కెట్ వంద కోట్లు దాటిపోయేది. మరి వేరొకరు వద్దన్న వాటిని కోరిమరీ చేస్తున్న దేవరకొండ నిర్ణయాలు రైటో రాంగో ఇంకో ఏడాదిన్నరలో తేలిపోతుంది