Virat Kohli repeats sachin tendulkarక్రికెట్ చరిత్రలో అద్వితీయమైన రికార్డులకు మారు పేరు సచిన్ రమేశ్ టెండూల్కర్. రిటైర్మెంట్ ప్రకటించగానే చాలా మంది క్రికెట్ అభిమానులకు ఈ క్రీడపై మక్కువ పోయిందని చెప్పడంలో సందేహం లేదు. అంతలా క్రికెట్ ప్రపంచాన్ని మన సచిన్ శాసించాడు. అయితే సచిన్ తర్వాత భారత జట్టులో ఎవరూ స్థానాన్ని భర్తీ చేస్తారు… అన్న అనుమానం, సందేహం, ప్రశ్నలు చాలా సందర్భాలలో క్రీడా విశ్లేషకులకు, అభిమానులకు కలిగింది. దానికి సమాధానంగా విరాట్ కోహ్లి అన్న పేరు అనతి కాలంలోనే వినిపించింది.

నిజమే… సచిన్ స్థాయిలో బ్యాటింగ్ ప్రతిభ చూపిస్తున్నాడు. అలాగే మ్యాచ్ ను విజయపు అంచుల దాకా తీసుకెళ్ళే సచిన్, ఆ క్లైమాక్స్ ను సరిగా ముగించలేని సందర్భాలు చాలా ఉన్నాయి. కాని సచిన్ చేయలేనటువంటిది ఆ కార్యక్రమాన్ని కూడా కోహ్లి దిగ్విజయంగా చేసి చూపిస్తున్నాడు. దీంతో భారత జట్టుకు మరో సచిన్ దొరికేసాడు అని అందరూ సంబరాలు చేసుకున్నారు.

కానీ టీమిండియాకు దొరికింది మరో సచిన్ కాదు… క్రికెట్ చరిత్రను మళ్ళీ తిరగ రాయగల పేరు విరాట్ కోహ్లి అని నిరూపిస్తున్నాడు. జెంటిల్మెన్ గేమ్ లో చరిత్రను సృష్టించిన వారు అతి కొద్ది మంది మాత్రమే. అందులో మాస్టర్ బ్లాస్టర్ పేరు నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. కానీ, విరాట్ విజయాలు అందిస్తున్న తీరు చూస్తుంటే… భారతదేశ క్రికెట్ చరిత్రలో ఒక కపిల్ దేవ్, ఒక గవాస్కర్, ఒక సచిన్, ఒక విరాట్ కోహ్లి అని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా కనపడుతున్నాడు.