Hippi Movie Poster Talkఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం సాధించిన నటుడు కార్తికేయ. తన తదుపరి చిత్రం, హిప్పీ రేపు విడుదల కాబోతుంది. ఈ చిత్రంతో ఆడ ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకోవాలని ఉబలాట పడుతున్నాడు మన హీరో. దాని కోసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కార్తికేయ చొక్కా విప్పి విన్యాసాలు చేసాడు. సరే కష్టపడి సంపాదించుకున్న సిక్స్ ప్యాక్ ఏదో ముచ్చటపడ్డారు లే అనుకుందాం. అయితే ఒక ఇంటర్వ్యూ జరిగింది మాత్రం ఎవరూ ఊహించలేనిది, భరించలేనిది.

ఇంటర్వూ చేసిన యాంకర్ అసలు హిప్పీ అంటే ఏమిటి? మాటలతో కాదు, చేతలతో చెప్పండి అన్నాడు. దీనితో అడగడమే తరువాయి కార్తికేయ షర్ట్ విప్పి కండలు చూపించాడు. అతని పక్కనున్న జేడి చక్రవర్తి చటుక్కున ఫ్యాంట్ విప్పి విసిరేసాడు. కేవలం పొట్టి టీషర్ట్, కింద కట్ అండర్ వేర్ మిగిలాయి. అదే అవతారంలో బయటకు నడిచి వెళ్లిపోయారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. బహుశా ఇటువంటి చేష్టలు చేస్తే సినిమాకు హైప్ వస్తుందని అనుకున్నారేమో.

అండర్ వేర్ మీద ప్రమోషన్ చేస్తే వచ్చే వాడు కూడా సినిమాకు రాడు. హీరోయిన్ సినిమాలో ఎక్సపోజింగ్ చేస్తే అది అందం, మగవాళ్ళు అండర్ వేర్ మీద నిలబడి విన్యాసాలు చేస్తే అది జుగుప్స. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో. దిగంగన సూర్యవంశి ఈ చిత్రంలో హీరోయిన్. కలైపులి ఎస్ థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై తమిళ దర్శకుడు టిఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి రేపు ఈ సినిమా తలరాతను ప్రేక్షకులు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.