Dhruva background scoreమెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ధృవ’ అన్ని హంగులు పూర్తి చేసుకుని డిసెంబర్ 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ ను కొల్లగొట్టే విధంగా ప్లానింగ్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక సినిమా హిట్టయ్యేది, ఫట్టయ్యేది ఇద్దరికీ ఖచ్చితంగా తెలుస్తుంది. అందులో ఒకరు ఎడిటర్ కాగా, మరొకరు సంగీత దర్శకుడు.

ఆ సంగీత దర్శకుడే మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే సమాచారాన్ని అందించారు. “దర్శకుడు సురేందర్ రెడ్డి సహకారంతో “ధృవ” బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చిందని, వెండితెరపై చూడడానికి నిరీక్షిస్తున్నానని, ఖచ్చితంగా రెండు సార్లు చూస్తానని, అభిమానులంతా చూసి పిచ్చేక్కిపోవడానికి సిద్ధం కమ్మని” పిలుపునిచ్చారు. “మేమంతా చాలా నమ్మకంగా ఉన్నాం, ఖచ్చితంగా ఓ భారీ విజయం అయితే దక్కుందని” ఫేస్ బుక్ వేదికగా హిప్ హాప్ అందించిన సమాచారంతో మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఊగిపోతున్నారు.

చూడబోతుంటే చిత్ర యూనిట్ “ధృవ”పై భారీ అంచనాలనే పెట్టుకున్నట్లుగా కనపడుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ట్రేడ్ వర్గాలలో కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఓవర్సీస్ లలో బ్రహ్మరధం పడతారన్న నమ్మకంతోనే, అక్కడ కూడా భారీ ప్రచారం చేస్తున్నారని, ఖచ్చితంగా ‘ధృవ’ ద్వారా మెగా వారసుడు మళ్ళీ రికార్డుల మోత మోగిస్తాడని చిత్ర యూనిట్ తో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి ఫస్ట్ టాక్ రావాలంటే కనీసం 8వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే!