highlight-scene-of-bharat-ane-nenuప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన “భరత్ అనే నేను” బొమ్మ సిల్వర్ స్క్రీన్ పై పడింది. ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ వంటి రెండు సినిమాలు దారుణమైన పరాజయాలతో ఉన్న ఫ్యాన్స్ కు ఊరట చెందే విధంగా ‘ఫస్ట్ టాక్’ బయటకు రావడం విశేషం. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ‘భరత్ అనే నేను’ చూసేందుకు సిద్ధమవుతున్నారు ప్రిన్స్ అభిమానగణం.

ముఖ్యంగా కొరటాల రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయని, అవి ప్రిన్స్ చెప్తుంటే మరింత ఎలివేట్ అయ్యాయనేది ప్రేక్షకుల టాక్. ఇంతకీ సినిమాలో ‘హైలైట్స్’ ఏంటి అనుకుంటున్నారా? అభిమానులకైతే చెప్పడానికి చాలా ఉన్నాయి గానీ, ఓవరాల్ గా ఓ సీన్ మాత్రం ‘భరత్ అనే నేను’ లో ఫాన్స్ ని బాగా ఖుషీ చేసింది.

సిల్వర్ స్క్రీన్ పై చూస్తారన్న ఉద్దేశంతో మొత్తం సన్నివేశాన్ని ఉదహరించడం లేదు గానీ, “చిటికెలు వేస్తూ మహేష్ బాబు చెప్పిన ప్రెస్ మీట్” సినిమాకే హైలైట్ సీన్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ప్రస్తుతం మీడియా చేస్తోన్న పనులకు, సినిమాలో మహేష్ పీకిన క్లాస్ సరిపోవడంతో ప్రేక్షకులకు ఈ సీన్ ఇట్టే కనెక్ట్ అవుతుంది. సన్నివేశాలు డిమాండ్ చేస్తే ప్రిన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో… ఈ సీన్ చెప్పకనే చెప్తుంది. మొత్తానికి ‘మా బాబు చిటికెలతో కుమ్మేసాడు’ అంటున్నారు ఫ్యాన్స్.