High Power Committee Report ఆంధ్రప్రదేశ్ రాజధాని హైపవర్ కమిటీ నివేదిక ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 18 లోగా కమిటి తమ నివేదిక సమర్పిస్తారని ముందు వార్తలు వచ్చాకా తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తో భేటీ అయ్యి ఆ తర్వాత పూర్తి నివేదిక సమర్పించేందుకు కమిటీ కొంత సమయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది.

హడావిడిగా కాకుండా సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న జరగాల్సిన కేబినెట్‌ భేటీ వాయిదా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ తదుపరి భేటీ ఈ నెల 17న జరగనున్నటు సమాచారం.

“హై పవర్ కమిటి అనేదే పెద్ద హంబక్. ముఖ్యమంత్రి చెప్పినట్టే వీరు కూడా నివేదిక ఇస్తారు అన్నదాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఏదో తాము సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు అనే ఫీలింగ్ కలిపించడానికే ఈ నాటకాలు,” అంటూ టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు రాజధాని రైతులు ప్రభుత్వానికి ఏం చెప్పదలచుకున్నారో.. రాతపూర్వకంగా సీఆర్డీఏ కమిషనర్‌కు 17లోగా అందజేయాలి అన్నారు.

ఈ మెయిల్ ద్వారా సూచనలు, సందేహాలు పంపించాలని కోరారు. ఈ ప్రాంతం కాని వారిని.. మహిళలను తీసుకొచ్చి రాజకీయాలకు వాడుకుంటున్నారని, నిజమైన రైతాంగానికి తాము చెప్పదలచుకున్నది అర్ధమైంది మంత్రులు అనడం విశేషం. హైపవర్ కమిటీ ఇప్పటి వరకు రెండుసార్లు సమావేశమయ్యింది