High court verdict on jagan photos and ysrcp colours పంచాయతీ ఆఫీస్ లకు వైసీపీ రంగులు వెయ్యడంపై కాసేపటి క్రితం హై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. పంచాయతీకి వేసిన రంగులు పార్టీ రంగులు వేర్వేరని చెప్పబోయిన ప్రభుత్వ లాయర్ పై కోర్టు విరుచుకుపడింది. రంగులను మేము గుర్తుపట్టగలమని న్యాయమూర్తి చెప్పుకొచ్చారు.

పార్టీ జెండా, గుర్తులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ఇదే సందర్భంగా పంచాయతీ ఆఫీస్ లమీద సీఎం ఫోటో ఎందుకు ముద్రించారని కోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని ముద్రించినట్టు ప్రభుత్వ లాయర్ చెప్పుకొచ్చారు. దీనిపై కూడా కోర్టు సీరియస్ అయ్యింది.

“పార్లమెంట్ మీద మోడీ, సుప్రీం కోర్టు మీద సీజేఐ ఫోటో ముద్రించారా?,” అని న్యాయమూర్తి ప్రశ్నించడం విశేషం. ఈ సంప్రదాయం ఎక్కడుందో చూపాలన్న న్యాయమూర్తి..కేసు రేపటికి వాయిదా వేశారు. దీనితో రంగుల విషయంలో జగన్ ప్రభుత్వానికి భంగపాటు తప్పేలా లేదు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ రంగులు వెయ్యడానికి ప్రభుత్వం దాదాపుగా 1300 కోట్లు ఖర్చుపెట్టిందని ప్రచారం జరుగుతుంది. పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడం ఈ విషయం కోర్టుకు చేరింది.