sakshi-banముద్రగడ చేస్తున్న దీక్షను హైలైట్ చేస్తూ తమ మీడియా ద్వారా కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన జగన్ మీడియా ‘సాక్షి’ టెలివిజన్ ప్రసారాలు ఏపీలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రసారాలను ఎవరు నిలిపివేశారు? ఏపీలో పాలన చేస్తున్న చంద్రబాబు సర్కారా? లేక కేబుల్ టీవీ ఎంఎస్ఓలా? ఈ రెండు ప్రశ్నలలో ఒక దానికైతే సమాచారం లభ్యమైంది. సాక్షి ప్రసారాలను నిలిపివేసారని హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో ఏపీ సర్కార్ బదులు చెప్పింది.

సాక్షి టెలివిజన్ ఛానల్ ప్రసారాలను నిలిపివేయాలని ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆదేశాలనూ ఇవ్వలేదని, ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తమ నుంచి ఎంఎస్ఓలకు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని, ప్రసారాలు ఆపాలని సూచించలేదని న్యాయవాది కోర్టుకు వెల్లడించగా, అదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ, కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు. దీంతో జగన్ కు పెద్ద జలక్కే ఇచ్చింది చంద్రబాబు సర్కార్.

మరి తదుపరి చర్య ఎలా ఉంటుందోనని మల్లగుల్లాలు పడడం ఎంఎస్ఓల వంతయ్యింది. ప్రభుత్వం ఆదేశించని పక్షంలో… నెక్స్ట్ బాల్ ఎంఎస్ఓ కోర్టులోనే పడనుంది. దీంతో వారి దగ్గర నుండి ఎలాంటి సమాధానం వస్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఒక్కసారి ముద్రగడ దీక్ష విరమించినట్లయితే, సాక్షి ప్రసారాలను మళ్ళీ ప్రారంభం కావడం ఖాయం అంటున్నాయి మీడియా వర్గాలు.