high-court-prabhas-guest-houseహైదరాబాద్‌ రాయదుర్గంలోని పన్మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమి ప్రభుత్వానిదేనంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో.. శేరిలింగంపల్లి రెవిన్యూ అధికారులు ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో హీరో ప్రభాస్‌ కు చెందిన గెస్ట్ హౌస్ ఉండటంతో దాన్నీ అధికారులు సీజ్‌ చేశారు. అయితే, తనకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఇల్లు సీజ్ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

[m0ad]

ఈ పిటిషన్ ను హై కోర్టు గత రెండు రోజులుగా వింటుంది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. యథాతధ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. విచారణను వాయిదా వేసింది. కేవలం సీజ్‌ మాత్రమే చేశామని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై ఈ నెల 24న కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది. ప్రభాస్ తన పిటిషన్ .లో ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవిరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి చట్టబద్ధంగా తాము కొనుగోలు చేశామనీ, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నామని తెలియజేశారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా ఈ భూమి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. ఇందుకోసం రూ. 1.05 కోట్ల ఫీజును కూడా చెల్లించామని ఆయన వివరించారు. ఈ దరఖాస్తు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు.