High Court of Andhra Pradeshఆంధ్రప్రదేశ్ హై కోర్టులో జగన్ ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఏ రాజకీయ పార్టీ పతాక రంగులు వేయడానికి వీల్లేదని, ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలకు వేసిన పార్టీల రంగుల్ని రెండు వారాల్లోగా తొలగించాలని వ్యాఖ్యానించింది.

మరోపక్క నిర్బంధ ఇంగ్లీష్ మీడియం బోధనలో కూడా ప్రభుత్వానికి చుక్కెదురు అయ్యేలా ఉంది. తుది తీర్పు ఇప్పటివరకు రానప్పటికీ ఈ కేసులో కోర్టు వ్యాఖ్యలు ఆ దిశగానే ఇండికేషన్స్ ఇస్తున్నాయి. ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుకోవాలని విద్యార్థులను ని ర్బంధించలేమని, అలా చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించడమేనని స్పష్టం చేసింది.

తమ తుది తీర్పు వచ్చేలోగా ఇంగ్లిష్‌ మీడియం అమలు కోసం పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణా తరగతుల నిర్వహణకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. విద్యాహక్కు చట్టప్రకారం కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

దీనితో ఏ విధంగా చూసినా హై కోర్టు ఇంగ్లీష్ మీడియం ని నిలిపివేయడం గానీ, లేకపోతే రెండు మీడియంలను కొనసాగించమని ఉత్తరువులు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకూ విద్యార్థులకు రెండు ఆప్షన్స్ ఇవ్వాలనే ప్రతిపక్షాల డిమాండు కు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పుడు కోర్టు ఆ విధంగా ఉత్తరువులు ఇస్తే ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందే.