Nimmagadda -Ramesh Kumar - YS Jaganస్ధానిక ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ముగ్గురు అధికారులు కలవాలని హైకోర్టు చెప్పింది. కరోనా పరిస్థితులు , ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దే తుదినిర్ణయం అని చెప్పింది.

కరోనా పరిస్థితుల కారణంగా… వాక్సిన్ పంపిణీ ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేం అని ప్రభుత్వం చెబుతుండడంతో… వాయిదా విషయంపై ఎన్నికల కమిషన్‌కే లేఖ రాయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం ప్రభుత్వ విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే తుది నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్ దేనని చెప్పింది. ఇప్పటికే ఈ ఎన్నికల విషయంపై పలుమార్లు వివాదం జరిగింది. తాజా ఆదేశాలపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లుగానే కమిషన్‌కు ప్రభుత్వం సహకరిస్తుందా లేక దీనిపై సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తుందా అనేది చూడాలి.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని చంద్రబాబు నాయుడు మనిషిగా చూస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనను సాగనంపాలని చూసి భంగపడింది. ఆయన అధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తే… తమ అంగ బలం అర్ధబలం ఉపయోగించడం కుదరదని ఆయన రిటైర్ అయ్యాకే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.