High Court of andhra Pradesh - Jaganరాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శాసన మండలిలో జరిగిన పరిణామాలకు సంంధించిన వీడియో టేపుల్ని న్యాయస్థానం ముందుంచాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. వివరాలన్నీ సీల్డు కవర్‌లో అందజేయాలన్నది న్యాయస్థానం ఆదేశించింది.

ఈ బిల్లులు మండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం ఆపేసింది. మంత్రులు మండలిలోకి వచ్చి చాలా గలాటా చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. టీడీపీ నియమించిన ఛైర్మన్ కావడంతో అసెంబ్లీ కార్యదర్శి సహకారంతో ఆయనను కూడా పక్కకు పెట్టింది ప్రభుత్వం.

శాసన మండలి బిల్లులను సెలక్ట్‌ కమిటీకి నివేదించినా కమిటీ వెయ్యకుండా ప్రభుత్వం మళ్ళీ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టడం రాజ్యాంగవిరుద్ధమా అనేది కూడా కోర్టు తేల్చే అవకాశం ఉంది. టేపులు గనుక కోర్టు ముందుకు వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు.

ఇదిలా వుంటే, మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి ‘స్టేటస్‌ కో’ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసేసింది. మండలిలో ఆధిక్యం వచ్చే వరకూ వేచి ఉండి బిల్లులు పాస్ చేయించుకుంటే సులువుగా అయిపోయేదానికి ఈ విషయాన్ని పెద్దది చేసుకుంది ఆంధ్రప్రదేశ్ లోని అధికారపక్షం. ఈ పరిమాణాలు ఇప్పుడు ఎక్కడకు దారి తీస్తాయో చూడాలి.