Hey Pillagada “ఫిదా” సినిమా సక్సెస్ తో తెలుగునాట ఓ రేంజ్ లో ‘స్టార్ హీరోయిన్’ స్టేటస్ పొందిన సాయి పల్లవికొచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు గతంలో ఆమె నటించిన పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకుల పైకి తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే “హేయ్ పిల్లగాడా” టైటిల్ తో ఓ సినిమా సిద్ధమవుతోంది. కేవలం సాయిపల్లవికి వచ్చిన అనూహ్యమైన క్రేజ్ తో సిద్ధమైన ఈ సినిమా తొలి టీజర్ లో అసలు సాయిపల్లవి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకుండా టీజర్ ను కట్ చేయడం విశేషం.

ప్రస్తుతం సాయిపల్లవి హవా నడుస్తుండడంతో, ఆమె హైలైట్ అయ్యేలా టీజర్ వదిలితే, సినిమాపై బజ్ ఏర్పడి ఉండేది. కానీ అలా కాకుండా రొటీన్ డబ్బింగ్ మూవీ మాదిరి విడుదల చేసిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కామెడీ విషయం ఏమిటంటే… అసలు ఎవరి క్రేజ్ తో అయితే ఈ సినిమా డబ్బింగ్ జరుపుకుందో, ఆ హీరోయిన్ పలికే ఒక్క డైలాగ్ కూడా ఈ టీజర్ లో లేకపోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే… సాయిపల్లవి క్రేజ్ ను రైట్ టైంలో ఉపయోగించుకోవాల్సిన తరుణంలో… రాంగ్ టీజర్ ను కట్ చేసినట్లుగా కనపడుతోంది.