టాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలతో మోసం!

call girls scandal through locanto websiteటాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ హీరోయిన్ల ఫొటోలను వాడుకుని అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్న మాజీ ప్రిన్సిపాల్ బండారం బయటపడింది. హీరోయిన్లను కాల్‌ గాళ్స్‌గా ట్యాగ్ చేస్తూ ఆన్‌లైన్ క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లో ప్రకటన ఇచ్చాడు. అలాగే, ధరలు కూడా ముందే నిర్ణయించాడు. 40 వేల నుంచి 60 వేల ధర నిర్ణయించిన ప్రిన్సిపాల్ అతడి మొబైల్ నంబరు కూడా ఇచ్చాడు.

ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ ఫ్లాట్‌ఫామ్ ‘లోకెంటో’లో హీరోయిన్ల ఫొటోలు కనిపించడంతో కొందరు మేడిపల్లికి చెందిన నిందితుడు సీహెచ్ గణేశ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే తొలుత డబ్బులు తన ఖాతాలో జమ చేయాల్సిందిగా కోరుతూ తన బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చాడు. డబ్బులు తన ఖాతాలోకి వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసేవాడు. అతడి వలలో పలువురు చిక్కుకున్నట్టు పోలీసులు తెలిపారు. మొత్తంగా 1.8 లక్షలు ఇలా తన ఖాతాలో వేయించుకున్నట్టు తెలిపారు.

తన ఫొటో క్లాసిపైడ్స్‌లో కనిపించడంతో పాప్యులర్ కేరక్టర్ ఆర్టిస్ట్ ఒకరు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు ఇంటర్మీడియెట్ కాలేజీల్లో అతడు ప్రిన్సిపాల్‌గా పనిచేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. వ్యాపారంలో దెబ్బతినడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకే ఇలా చేస్తున్నట్టు నిందితుడు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.

Follow @mirchi9 for more User Comments
Pawan Kalyan Rubbishes TDP Alliance RumoursDon't MissPawan Kalyan Rubbishes TDP Alliance RumoursTDP Rajya Sabha MP TG Venkatesh spiced up the Political Rumours saying that TDP and...Manikarnika: Confidence or Overconfidence - Result Coming This WeekDon't MissConfidence or Overconfidence - Result Coming This WeekBollywood movie 'Manikarnika', the biopic made on the queen of Jhansi, Rani Lakshmi Bai is...Akhil Akkineni Has Changed for the BetterDon't MissAkhil Has Changed for the BetterYoung Akkineni hero is awaiting the release of his third movie and hoping for a...What-Is-The-Best-Date-For--MaharshiDon't MissWhat Is The Best Date For Maharshi?The release date of Maharshi has become a topic of major concern among the fans...Check Out: Six Packs 'Rocking Mr Majnu Akhil AkkineniDon't MissCheck Out: Six Packs 'Rocking Mr MajnuThe makers of Mr Majnu are doing all they can to keep the momentum and...
Mirchi9