కొందరు ఇతరుకు సంబంధించి చెప్పే మాటలు, చేసే పనులు చూస్తే అబ్బో వీళ్లంతా గొప్పోరు లేరే అనిపించేలా ఉంటాయి. కానీ వాళ్ల వరకు వచ్చేసరికి అప్పటి వరకు ఎదుటి వారు ఫాలో కావాల్సిందేనంటూ చెప్పిన మాటలు నీటి మూటలే అవుతాయి. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే, కొన్ని రోజుల ముందు సినిమా ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. హీరోల రెమ్యునరేషన్స్ ఎక్కువయ్యాయి అన్నారు. కానీ బడా హీరోలను ఏమీ అనలేరు. కాబట్టి సినీ కార్మికులపై పడ్డారు మన ప్రొడ్యూసర్స్. కాస్ట్ కంట్రోల్ పేరుతో వారి జీత భత్యాలను తగ్గించాలని చూశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో భాగమైన ఓ నిర్మాత ఈ క్రమంలో ఓ నెల రోజుల పాటు షూటింగ్స్‌ను ఆపేసి.. ప్రొడక్షన్ కంట్రోల్ పేరుతో మీటింగ్‌లు పెట్టారు. నానా యాగీ చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు. నెల రోజుల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి. చివరకు ఈ చర్చల ఫలితంగా ఏం జరిగిందో.. ఎవరికి ఒరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు షూటింగ్స్ మళ్లీ స్టార్ట్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు చెందిన ఓ యువ నిర్మాత సినిమా శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. అర సినిమా హిట్ కొట్టేసిన శ్రీలీలకు హీరోయిన్‌గా కాస్తో కూస్తో పేరు రావటంతో అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే ఆమెకు నటిగా తన క్యాలిబర్ ఏంటో మాత్రం ఇప్పటి వరకు నిరూపించుకోనేలేదు. ఏదైతేనేం అవకాశాలు వస్తున్నాయిగా పర్లేదనుకుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్న సదరు యంగ్ నిర్మాత మాత్రం ఆమెకు ఏ లోటు రానీయటం లేదని టాక్. ఎందుకంటే ఆమె కోసం జూబ్లీ హిల్స్‌లో ఖరీదైన హోటల్లో సూట్ రూం తీసుకున్నాడాయన. ఆ హోటల్లో సూట్ రూమ్ కావాలంటే రోజుకి రూ.20 వేలు కట్టాలి. అయితేనేం ప్రొడ్యూసర్ అంతా తానై శ్రీలీలకు మర్యాదల విషయంలో లోటు రానీయటం లేదట.
ఒక రోజుకే రూమ్ రెంట్ రూ.20 వేలు అయితే, 20 రోజులు ఆమె కాల్షీట్స్ ఉంటే నాలుగు లక్షలు రూపాయలు హోటల్ గదికే చెల్సించాల్సి ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయితే సరేలే అని సర్దుకోవచ్చు. కానీ పేరు ఊరు లేని ఓ హీరోయిన్ కోసం అంత ఖర్చు పెట్టాలా! అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రొడక్షన్ కంట్రోల్ అంటే ప్రతి విషయంలోనూ నిర్మాతలు జాగ్రత్తలు పాటించాలి. హీరో, హీరోయిన్స్‌కి ఓ రూల్.. సినీ కార్మికులకు ఓ రూల్ అని చూడకూడదు. కానీ గిల్డ్ నిర్మాత అలా ఆలోచించటం లేదు.