చాలా రోజుల క్రితం అఖిల్ అక్కినేని తన నాలుగో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు అయితే ఇప్పటిదాకా సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ లేట్ అయ్యిందని సమాచారం. అయితే ఇప్పటికైనా హీరోయిన్ ఫైనల్ అయ్యిందా అంటే అవ్వలేదని తెలుస్తుంది. దీనితో ఈ 26 నుండి షూటింగ్ మొదలు పెట్టి హీరోయిన్ అవసరం లేని భాగాల షూటింగ్ చేద్దాం అని చిత్ర యూనిట్ భావిస్తుంది. హీరోయిన్ విషయంలో అక్కినేని అభిమానులకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి.

బెల్లంకొండ లాంటి హీరోలు స్టార్ హీరోయిన్లను పెట్టుకుంటుంటే అఖిల్ మాత్రం ఊరు పేరు లేని హీరోయిన్లను పెడుతున్నాడు. వారి వల్ల సినిమాకు ఎటువంటి హెల్ప్ కావడం లేదు. అయితే ఈ సినిమాకు కూడా కొత్త అమ్మాయిలనే చూస్తున్నారని సమాచారం. గత కొంత కాలంగా ఆడిషన్లు చేస్తున్నారు. మొన్న ఆ మధ్య ఇండస్ట్రీలో కాస్త లైమ్ లైట్ లో వున్నవారినీ పరిశీలించినా పని అవ్వలేదు. ఇప్పడిప్పుడే వచ్చిన, వస్తున్న అమ్మాయిల దగ్గర నుంచి కాస్త పాపులర్ యంగ్ హీరోయిన్లను తీసుకోవాలని చిత్రం బృందం అనుకుంటుంది.

అయితే ఈ నిర్ణయం పట్ల అక్కినేని అభిమానులు హ్యాపీగా లేరు. ఎన్ని ప్లాపులు వచ్చినా లైమ్ లైట్ లో లేని డైరెక్టర్లు, హీరోయిన్ లేనా అని వారు అంటున్నారు. ఎంత ప్రయత్నించినా అక్కినేని హీరో అఖిల్‌ని హిట్ మాత్రం పలకరించడం లేదు. ‘అఖిల్’, ‘హలో’, Mr. మజ్ను’ ఇలా ఒకదాన్ని మించి మరోటి డిజాస్టర్ గా మారి ఆతనిని వేధిస్తున్నాయి. ఈ క్రమంలో తరువాతి సినిమా హిట్ కొట్టకపోతే మొత్తానికి కనుమరుగు కావలసిన పరిస్థితి. ఈ సమయంలో అఖిల్ నాలుగో చిత్రంపైనే అభిమానులు ఆశలన్నీ ఉన్నాయి. ఎలాగైనా హిట్ కొట్టి అక్కినేని పేరు నిలబెట్టాలని వారు కోరుకుంటున్నారు.