Heroine-Anjali-Latest-Lookఅందం, అభినయంతో తెలుగు హీరోయిన్ గా మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బ్యూటీ అంజలి ప్రస్తుత రూపం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళల్లో మంచి ఫిజిక్ తో ఉన్న అంజలి, గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత బాగా లావయ్యింది.

దీంతో బొద్దుగుమ్మగా విమర్శలు రావడంతో, గత కొంతకాలంగా ఫిట్ నెస్ పై దృష్టి కేంద్రీకరించిన అంజలి, ఇటీవల సన్నగా కొండపల్లి బొమ్మగా మారిపోయింది. అయితే అక్కడితో ఆగకుండా మరీ బక్కచిక్కిపోయిందన్న విషయం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఫోటోలు చెప్తున్నాయి.

ఒక విధంగా చెప్పాలంటే ‘బొచ్చు పీకేసిన కోడి’ మాదిరి కనపడుతోన్న అంజలి లుక్స్ అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు. దీంతో బొద్దుగా ఉన్న సమయంలోనే అంజలి బాగుందన్న కామెంట్స్ ఇప్పుడు వినపడుతున్నాయి. ఇంతలా తగ్గినా… సినీ అవకాశాలలో ఏ మాత్రం మార్పు రాలేదు.