Actor-Sivaji-Andhra-Pradesh-Special-Status-BJP-attack‘ప్రత్యేక హోదా’ సాధించే ఉద్దేశం రాజకీయ నేతలకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ లేదని, వాళ్ళందరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారని, ఎవరికీ ప్రత్యేక హోదా సాధించే చిత్తశుద్ధి లేదని హీరో శివాజీ కీలక వ్యాఖ్యలు చేసారు. కొందరు నేతలైతే రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించేందుకు డబ్బులు కూడా తీసుకున్నారని, వాళ్ళందరి గుట్టు విప్పుతానని మండిపడ్డారు.

మరో పది రోజుల్లో అందరినీ నడిరోడ్డుపై నిలబెట్టి జనాలు రాళ్ళు వేసి కొట్టేలా చేస్తానని చెప్పిన శివాజీ, తనకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ‘స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, పోలవరం’ వంటి కీలకమైన అంశాల కోసం రాజకీయ నాయకులే పోరాటానికి దిగని సందర్భంలో…, సినీ హీరోలను ఎలా విమర్శిస్తామని ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు శివాజీ లాజికల్ గా ప్రసంగించారు.