Hero Ram, Hero Ram Meets Kundana Purnachandrika, Hero Ram Meets Fan Kundana Purnachandrika, Hero Ram Meets 4 Years Old Fan Kundana Purnachandrika, Hero Ram Meets Vizag Fan Kundana Purnachandrikaవిశాఖకు చెందిన ఐదేళ్ల బాలిక కుందన పూర్ణ చంద్రిక టాలీవుడ్ యంగ్ హీరో రామ్ కు వీరాభిమాని. పుట్టుకతోనే గుర్తు తెలియని వ్యాధితో సతమతమవుతున్న ఆ బాలిక మరెంతో కాలం బ్రతకదట. ఈ క్రమంలో విశాఖకు వచ్చిన రామ్ ను చూడాలనుందన్న ఆ బాలిక కోరిక ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు నెరవేరింది. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన రవికుమార్ రెండో కుమార్తె పూర్ణచంద్రిక పుట్టిన నాటి నుంచి కాళ్లు కదపలేకపోతోంది.

అంతుపట్టని వ్యాధితో సతమతమవుతున్న ఈ బాలిక, ఇంకెంతో కాలం బ్రతకదని వైద్యులు తేల్చేశారు. తన అభిమాన నటుడు విశాఖలో జరుగుతున్న షూటింగ్ లో ఉన్నాడని తెలుసుకున్న ఆ బాలిక అతడిని చూడాలనుందని తల్లిదండ్రులకు చెప్పగా… వారు యూనిట్ సభ్యులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న రామ్ నేరుగా ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. కదలలేని స్థితిలో ఉన్న బాలికను ఎత్తుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పాడు.