Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Photos, Gautamiputra Satakarni Working Stills, Balakrishna Gautamiputra Satakarni Stills, Shreya Saran Gautamiputra Satakarni Photos, Hema Malini Gautamiputra Satakarni Photosనందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తరాదిన గల చారిత్రాత్మక కోటలలో జరుగుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ వేషధారణ చూసి నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్తేజం ఉరకలేస్తోంది.

సింహాసనంపై అధిష్టించే రాజు మాదిరి ఉన్న బాలయ్య బాబు స్టిల్స్ ఆకట్టుకునే విధంగా ఉండగా, బాలకృష్ణకు జతగా నటిస్తున్న శ్రియా శేరన్ మరియు హేమామాలినిల లుక్స్ కూడా ఈ సందర్భంగా దర్శనమిచ్చాయి. ఎవరికి వారు వీక్షకులను పూర్తిగా సంతృప్తి పరచడంలో విజయవంతం అయ్యారు. ప్రస్తుతం గ్వాలియర్ కోటలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.