Is-This-Real-Reason-Behind-Akhil’s-Hello-Movie-US-Tourవచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అక్కినేని అఖిల్ “హలో” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో కూడా సూపర్ సక్సెస్ సాధించడంతో, చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించింది.

ఇందులో భాగంగా నాగార్జున, అఖిల్ లు కలిసి ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 17 ఏళ్ళ క్రితం విడిపోయిన వారు… వారి సోల్ మేట్ కోసం ఎలా అన్వేషిస్తారు… ఒక ఫోన్ నెంబర్ ను, ఫోన్ ను ఎలా పట్టుకుంటారు అనేదే సినిమా కధగా నాగ్ చెప్పుకొచ్చారు.

దీనినే సినిమా ట్రైలర్ లో స్పష్టంగా చెప్పేసామని, అయితే దీనిని ఎలా సాధిస్తాడు అనేది ఆసక్తికరంగా… విక్రమ్ స్టైల్ లో ఉంటుందని నాగ్ తెలిపారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా “హలో” సినీ ప్రేక్షకులందరినీ ఖచ్చితంగా అలరిస్తుందని ఈ సందర్భంగా మరోసారి నాగ్ అండ్ అఖిల్ లు ధృవీకరించారు.