Hello-Guru-Prema-Kosame‘నేను లోకల్’ సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారిన త్రినాధరావు నక్కిన, తాజాగా దర్శకత్వం వహిస్తోన్న “హలో గురు ప్రేమ కోసమే” సినిమా ఫస్ట్ టీజర్ ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘వినాయకచవితి శుభాకాంక్షలు’ తెలుపుతూ విడుదల ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని ఖరారు చేసింది చిత్ర యూనిట్.

వాన వస్తుంటే గొడుగు వేసుకుని నడుస్తోన్న హీరో రామ్ వెనుక…. అదే వానలో గొడుగు తీసేసి చిందేస్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్…. ఇలా హీరోహీరోయిన్ల స్వభావంతో ఈ పోస్టర్ ను విడుదల చేసారు. చాలా కూల్ గా కనపడుతోన్న ఈ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.