హీరోగా రామ్ కు ఖచ్చితంగా హిట్ కావాల్సిన ఆవశ్యకతలో విడుదల అయిన “హలో గురు ప్రేమ కోసమే” సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉంది? రామ్ అండ్ చిత్ర యూనిట్ ఆశించిన విధంగానే వెలువడిందా? అంటే…. నిరాశ చెందే టాక్ అయితే వెలువడకపోవడం చెప్పుకోదగ్గ విషయం. అవును… ‘హలో గురు ప్రేమ కోసమే’కు నెగటివ్ టాక్ అయితే లభించలేదు.

ఇదే సమయంలో… ‘ఇదేదో బ్లాక్ బస్టర్’ అన్న టాక్ కూడా వ్యక్తం కాలేదు. కానీ ధియేటర్లో రెండున్నర్ర గంటల పాటు లాజిక్ లు, మ్యాజిక్ లు మరిచిపోయి కాసేపు నవ్వుకుని వచ్చే ‘టైం పాస్ ఎంటర్టైనర్’ అన్న ఫస్ట్ టాక్ ను ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే… “ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్… సెకండాఫ్ సెంటిమెంట్…” ఈ రెండింటి నడుమ ఫన్నీ సీన్స్…!

కొత్తదనం కావాలని పరితపించే ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరుస్తుందేమో గానీ, రొటీన్ కమర్షియల్ స్టోరీలను ఇష్టపడేవారికి ‘రామ్ అండ్ కో’ పంచిన కామెడీ ‘పాస్ మార్కులు’ వేయించుకుంది. అయితే అది బాక్సాఫీస్ వద్ద ఇది ఎంతటి కమర్షియల్ సక్సెస్ ను అందిస్తుందో తెలియాలంటే మరో రెండు, మూడు రోజులు వేచిచూడాల్సిందే.