Hello-Guru-Prema-Kosameమరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “హలో గురు ప్రేమ కోసమే” సినిమా పబ్లిసిటీలో భాగంగా టైటిల్ సాంగ్ వీడియో ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇండోర్ సెట్స్ లో చిత్రీకరించబడిన ఈ సాంగ్ లో రామ్ రొటీన్ స్టెప్పులు ఉండగా, క్లాస్ అండ్ సాఫ్ట్ హీరోయిన్ గా పేరొందిన అనుపమ పరమేశ్వరన్ మాస్ హావభావాలను ప్రదర్శించడం కొత్తగా పేర్కొనవచ్చు.

ఇదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు కూడా ముందుగానే చెప్పగా, తాజాగా ఈ వీడియో ప్రోమో దానిని ఖరారు చేసింది. అయితే ఈ మాస్ ఎక్స్ ప్రెషన్స్ లో క్యూట్ గా కనిపించే అనుపమను చూడడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది గానీ, బహుశా సిల్వర్ స్క్రీన్ పై సిట్యూయేషన్ సింక్ అయితే ఇవే ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయే అవకాశం లేకపోలేదు. ఈ సినిమా విజయం హీరో రామ్ కు చాలా కీలకం.