Hebah Patel Turning as item girlకుమారి 21ఎఫ్ తో తెలుగు తెరకు పరిచయమైన హెబా పటేల్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఆ సినిమా పెద్ద హిట్ కావడం ఆ అమ్మడు గ్లామర్ తో యూత్ మతిపోగొట్టడంతో ఆమెకు ఎదురులేదనుకున్నారు. ఆ తరువాత వరుసగా తప్పు స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకోవడంతో ఆమెకు అతికొద్ది కాలంలోనే ఆఫర్లు లేకుండా పోయాయి.

ఇటీవలే విడుదలైన నితిన్ భీష్మ సినిమాలో ఆమె చాలా చిన్న పాత్ర చేసింది. ఆ పాత్ర దాదాపుగా వ్యాంపు క్యారెక్టర్ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తాజాగా ఆమె ఐటెం గర్ల్ గా మారబోతుందట. రామ్ హీరో గా వస్తున్న రెడ్ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేస్తుంది. ఈ పాట ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్స్ లో షూట్ చేస్తున్నారు.

జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. దీనిబట్టి ఈ అమ్మడు ఇక హీరోయిన్ అవకాశాల మీద ఆశలు వదిలేసుకున్నట్టే. రెడ్ కు తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ – తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో రెడ్ వస్తుంది.

ఇస్మార్ట్ శంకర్ కు సూపర్ ఆల్బం ఇచ్చిన మణిశర్మ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు. రామ్ పెదనాన్న స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్నారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తుండటం విశేషం. చాలా కాలం వేచి చూసి చాలా కష్టపడి సంపాదించుకున్న సక్సెస్ ను రామ్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. రెడ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.