Hebah -Patel Loose Weightఇటీవలే రెడ్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో తళుక్కుమన్న హెబ్బా పటేల్… వెబ్ సిరీస్లలో కూడా బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న మూడు వెబ్ సిరీస్లు విడుదలకు సిద్ధం అవుతున్నాయట. మరోవైపు కోవిడ్ తరువాత ఆమె గ్లామర్ పాత్రలలోనే కాకుండా పెర్ఫార్మన్స్ కు అవకాశం ఉన్న సబ్జెక్టులు కూడా సైన్ చేసి కేరీర్ స్పాన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుందట. ఐటెం సాంగ్ క్లిక్ అయ్యిందని మూసగా అదే పద్దతిలో వెళ్లిపోకుండా విభిన్నమైన సబ్జెక్టులు ఎంచుకోవడం మెచ్చుకోవాల్సిన విషయం.

అందులో భాగంగా ” తెలిసినవాళ్ళు” అనే సినిమాలో నటిస్తుందట ఈ అమ్మడు. ఇటీవలే ఎఫ్ సియూకే చిత్రంలో నటించిన రామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ గా వస్తుందట. అయితే ఈ సినిమా కోసం చాలానే కష్టపడిందంట ఈ అమ్మడు. లాక్ డౌన్ సమయంలో బరువు పెరగడం తో ఈ సినిమా కోసం జిమ్, డైట్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి ఏడెనిమిది కేజీలు తగ్గిందట.

ఒకదశలో షూట్ మొదలుపెట్టేదాం అని చిత్ర బృందం కంగారుపడినా…. తాను అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదని పది రోజులు షూటింగ్ లేట్ చేసి మరీ పర్ఫెక్ట్ షేప్ లోకి వచ్చి షూట్ చేసిందట. తన కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుందని చెప్పుకొస్తుందని ఈ అమ్మడు. విప్లవ్ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ దాదాపుగా ఎనభై శాతం పూర్తయ్యింది.

ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. ఇటీవలే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలయ్యింది. ఒక కుర్చీలో హెబ్బా మొండెం మాత్రం దర్జాగా కూర్చుని ఉండగా… పక్కన ఉన్న ఫొటోలో ఆమె మొహం కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో సరైన పర్సనాలిటీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది హెబ్బా.