Amaravati- High Court Roadరెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ స్థాయిలో ఆస్థి నష్టం, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ మాత్రం ఇటువంటి తరుణంలో కృష్ణా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు ఎప్పుడు మునుగుతుందా? ఎప్పుడు అమరావతి మునుగుతుందా? అనే ఆత్రమే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.

వర్షం పడగానే ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఎక్కడెక్కడివో ఫోటోలు తెచ్చి అమరావతి మునిగిపోయింది అంటూ ఫోటోలు పెడుతున్నారు. తాజాగా హైకోర్టుకు వెళ్లే రోడ్డు మునిగిపోయింది అంటూ ఏవో ఫోటోలు తెచ్చారు కూడా. అయితే ఇందుకు ప్రతిగా తెలుగుదేశం వారు ఈ రోజు ఆ దారిలో తీసిన ఫోటోలు, వీడియోలు పోస్టు చేసి వారి ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.

మరోవైపు కొందరు కృష్ణా, గుంటూరు జిల్లాల నీట మునిగిన కొన్ని ప్రాంతాల ఫోటోలు తెచ్చి అమరావతి మునిగిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు. అందులో చాలావరకు రాజధాని ప్రాంతానికి పదుల మైళ్ళ దూరంలో ఉన్నవి కావడం విశేషం. అమరావతి తరలింపు… మూడు రాజధానుల విషయంలో తమ స్టాండ్ ను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి పడుతున్న తంటాలు ఇవి.

అయితే ఈ క్రమంలో రాష్ట్ర పరపతిని ప్రపంచం ముందు పల్చన చెయ్యడం దురదృష్టకరం. మరోవైపు… చంద్రబాబు ఇల్లు ని ముంచడానికి ప్రకాశం బ్యారేజీ లో నీటి విడుదల సరిగ్గా లేదని… రాజధానికి ముంపు తప్పించే కొండవీటి వాగు ప్రాజెక్టు ని ఉద్దేశపూర్వకంగా సరిగ్గా వాడటం లేదని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.