Valmikiమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అంటించిన వాల్మీకి చిత్రం వచ్చే నెల 13న విడుదలకు సిద్ధం అవుతుంది. సినిమా విడుదల దగ్గర పడుతుండగా చిత్రంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. వాల్మీకి సినిమా టైటిల్‌ మార్చాలంటూ ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బోయ వాల్మీకి కులస్థుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్‌ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్‌ దాఖలు చేసింది.

తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ లో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం షూటింగ్ కోసం అనంతపురం వెళ్తే అక్కడి వాల్మీకి కులస్తులు అడ్డుకున్నారు. దీనితో మెగా అభిమానులు రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ కొంత టెన్షన్ పెరిగింది. మొట్టమొదటి సారిగా విలన్ కనిపించబోతున్న వరుణ్ తేజ్ లుకే సినిమాకు హైలైట్ గా నిలిచింది. మరోవైపు వాల్మీకి అదే రోజు విడుదల కానున్న నాని గ్యాంగ్ లీడర్ తో బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడనున్నది.

14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. చిత్రంలో దర్శకుడు హరీష్ శంకర్ తన మార్కు మార్పులు చేశాడని తెలుస్తుంది. దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు ఈ సినిమాకు పని చేస్తున్నాడు. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం పై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత నాలుగు చిత్రాలలో మూడు హిట్లు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు వరుణ్ తేజ్.