hawaa-movie -trailer-talk9 బ్రైన్స్… 9 క్రైమ్స్… 9 హవర్స్… అంటూ హంగామా చేసిన “హవా” ధియేటిరికల్ ట్రైలర్ ను 9 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేసారు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను బాగా కట్ చేసారు. అంతా కొత్తవారితో రూపొందించడంతో ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది.

చిన్న సినిమాలు కూడా ఎంత నాణ్యతతో నిర్మాణం అవుతున్నాయో అని చెప్పడానికి నిదర్శనంగా ఈ “హవా” ట్రైలర్ ను పేర్కొనవచ్చు. దాదాపుగా రెండు నిముషాల నిడివి గల ఈ ట్రైలర్ ను చూస్తున్నంతసేపు, ఎక్కడా చిన్న సినిమా అన్న ఫీలింగ్ రాకుండా సినిమాను అందించబోతున్నారు.

మహేష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య, దివి ప్రసన్నలు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిల్మ్ అండ్ రీల్స్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమాకు గిఫ్టన్ అలియాస్ అందించిన సంగీతం అందించారు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను నవంబర్ 23గా ఖరారు చేయడం చెప్పుకోదగ్గ విషయం.