hate story 3 movie collectionsబాలీవుడ్ లో ‘అడల్ట్’ కంటెంట్ వున్న సినిమాల రూపకల్పన సాధారణమైపోయింది. ఒకప్పుడు మల్లికా షెరావత్ ‘మర్డర్’ వంటి హాట్ సినిమాల తర్వాత ఎఫైర్లతో కూడిన చిత్రాలు ఎక్కువగా రూపొందాయి. ఆ ఒరవడి ‘గ్రాండ్ మస్తీ’ గ్రాండ్ సక్సెస్ తర్వాత మరింతగా పెరిగింది. ఎంతగా అంటే… అగ్ర హీరోల సినిమాలలో సైతం ‘డబుల్ మీనింగ్ డైలాగ్స్’ పెట్టేలా..! విమర్శకులు ఎంతగా ఏకిపారేస్తున్నా ప్రేక్షకుల ఆదరణ ఉండడంతో ‘అడల్ట్’ కంటెంట్ సినిమాలు ఎక్కువగా నిర్మాణం జరుపుకుంటున్నాయి.

తాజాగా విడుదలైన “హేట్ స్టొరీ 3” సినిమాకు బాలీవుడ్ సినీజనాలు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా ట్రైలర్లు విడుదలైన సమయంలో… వెండితెరపై మరీ ఇంత విచ్చలవిడి శృంగారం ఏమిటి అన్న విమర్శలు వెలువడ్డాయి. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా సైలెంట్ గా 50 కోట్లు తన ఖాతాలో వేసుకోబోతోంది.

ఇండియాలో “హేట్ స్టొరీ 3″ఇప్పటివరకు 44.45 కోట్లు కొల్లగొట్టి 50 కోట్ల మార్క్ దిశగా పయనిస్తోంది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాబడుతుండడంతో వచ్చే వారానికి 50 కోట్లు అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. “హేట్ స్టొరీ 3” నిర్మాణ ఖర్చులతో పోల్చుకుంటే… ఇది ఒక ‘బ్లాక్ బస్టర్’ క్రింద లెక్క. కేవలం పాటల్లో చూపించిన శృంగారనికే 50 కోట్లు కట్టబెడితే 2016 జనవరిలో సన్నీ లియోన్ సెన్సేషనల్ మూవీకి ఎన్ని కోట్లు అందిస్తారోనన్న టాక్ ఊపందుకుంది.