harish shankar as producer‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రాలతో టాప్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీష్‌ శంకర్‌ ఆ తర్వాత ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంతో డిజాస్టర్‌ను చవి చూశాడు. దాంతో కొంత గ్యాప్‌ తీసుకున్న హరీష్‌ శంకర్‌ ఇటీవలే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ మూవీని తెరకెక్కించి సక్సెస్‌ను సాధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన తన వద్ద ఉన్న ఒక మాస్‌ మసాలా కథాంశంతో ఒక స్టార్‌ హీరోతో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీలోని ఒక హీరో డేట్స్‌ కోసం ఈయన ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ గ్యాప్‌లోనే ఈయన నిర్మాతగా మారాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక హీరోలు, దర్శకులు నిర్మాతలుగా మారడం టాలీవుడ్‌లో ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. తాజాగా దర్శకుడు సుకుమార్‌ ‘కుమారి 21ఎఫ్‌’ చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకుని భారీ లాభాలను సైతం దక్కించుకున్నాడు. దాంతో ఈ గబ్బర్‌ సింగ్‌ దర్శకుడు సైతం నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడు. తన శిష్యుడితో ఒక చిన్న బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. దర్శకుడిగా తన సినిమా ప్రారంభం కాకుండానే నిర్మాతగా ఆ యువ దర్శకుడితో సినిమాను నిర్మాతగా ప్రారంభించాలని హరీష్‌ శంకర్‌ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. తనకు అత్యంత సన్నిహితులు అయిన వారితో కలిసి ఈ సినిమాను భాగస్వామ్యంలో నిర్మించబోతున్నాడు ఈ దర్శకుడు. మరి సుకుమార్‌కు దక్కినట్లుగా హరీష్‌ శంకర్‌కు సైతం సక్సెస్‌ దక్కేనా చూడాలి.