Harish Rao Wife Srinitha Rao into telangana poliicsగత కొద్ది కాలంగా తెలంగాణ మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు, హరీష్ రావుని పార్టీలో, ప్రభుత్వంలో ఒంటరిని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో హరీష్ కు చోటు దక్కే అవకాశం ఉండదని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. హరీష్ ను రాష్ట్రం నుండి తప్పించి కొడుకు కేటీఆర్ కు ఇక్కడ పట్టాభిషేఖం చెయ్యాలని కేసీఆర్ వ్యూహమని వదంతులు వ్యాపిస్తున్నాయి. దీనికోసం హరీష్ మెదక్ పార్లమెంట్ నుండి పోటీ పెడతారట. ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గానికి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఆయన ఖాళి చేసిన సీటును హరీశ్‌రావు సతీమణి తన్నీరు శ్రీనితకు బై ఎలక్షన్‌ లో టిక్కెట్టు ఇస్తారట. ఈ విషయం చెప్పింది సీఎం కేసీఆర్‌ అన్న కూతురు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్‌. రమ్యారావు. ఆదివారం తమ పార్టీకి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో ‘తాజా తెలంగాణ’ పేరుతో ఈ పోస్టు పెట్టారు. ‘‘మరో 4 నెలల్లో సిద్దిపేటకు బై ఎలక్షన్‌. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత’’అని అందులో పేర్కొన్నారు. మరోవైపు మొన్న ఆ మధ్య 10 తారీఖున కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించనున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఇది కూడా జరగలేదు. సరిగ్గా ఈరోజు కు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే ఇప్పటికీ కేసీఆర్ తనతో పాటు మరో మంత్రితో మాత్రమే పాలన సాగిస్తున్నారు. మరోవైపు అసలు పార్లమెంట్ ఎన్నికల ముందు కేబినెట్ విస్తరణ ఉండదని ఎన్నికల తరువాతే ఉంటుందని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ ఆలస్యం ఆ విషయం నిజం అవుతుందేమో అనే అనుమానాలు రేకెత్తిస్తుంది. చూడాలి ఈ విషయంలో కేసీఆర్ ఏం చెయ్యబోతున్నారో!