ఓ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరైనందుకుగానూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్వీయ జరిమానా విధించుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులకు చెత్తబుట్టలను అందజేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ఆలస్యంగా రావడంతో తనకు తానుగా 50లక్షల జరిమానా విధించుకున్నారు.
ఆ మొత్తంతో ఆధునిక హంగులతో మహిళా భవనాన్ని నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు సమయపాలనకు కట్టుబడి ఉండటం మంచిదే. సమయాన్ని పాటించలేకపోయినప్పుడు జరిమానాలు విధించడం అనేది కూడా మంచి పరిణామమే. అయితే ఆ జరిమానాలు సొంత నిధులతో అయితే వారికి జవాబుదారీతనం పెరుగుతుంది.
ప్రభుత్వ నిధులతో స్వీయ జరిమానాలు విధించుకుంటే వాటివల్ల ఏం ఉపయోగం? అని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ సొమ్ములంటే కనీస మర్యాద లేని వారు ఎవరైనా ఉంటే అది మన రాజకీయ నాయకులే. అయితే ఈ విషయం లో హరీష్ ను పూర్తిగా నిందించలేం. ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన. ఒకరకంగా అది కూడా మంచిదే. పనిలో పనిగా కొంత స్వీయ జరిమానా పేరుతో స్వీయ పబ్లిసిటీ.
ఇది ఇలా ఉండగా మంత్రి హరీష్ రావు ఈ మధ్య కాలంలో రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పక్కన పెట్టేసారు అని వార్తలు వస్తున్న తరుణంలో హరీష్ కుడా కొంతమేర లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. ఎక్కువగా తన నియోజకవర్గ పరిధిలోని కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం తరపున మీడియాతో మాట్లాడటం లాంటివి అయితే పూర్తిగా మానేశారు.
Managing Two Heroines, This Manager Becomes A Sucker!
Mirchi9.com: Number 2 Telugu Website!