Harish Raoఒకవైపు హైదరాబాద్ లో మెట్రో రైల్ పరుగు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతున్న మినిస్టర్ హరీష్ రావు జాడ కనిపించడం లేదు మరో మంత్రి కేటీఆర్ అంతా తానే అన్నట్టు నడిపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే హరీష్ ను దూరం పెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు హరీష్ ఏమైనట్టు?

హరీష్ రావును ఉన్న పళంగా ఢిల్లీ పంపారట ముఖ్యమంత్రి. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం అనుమతుల త్వరగా వచ్చేలా చూడడం కోసం ఆయన ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారట. కేసిఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అటవీ, పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా రావడానికి ఆయన కేంద్రం, కేంద్ర జలవనరుల సంఘం అధికారులను కలవనున్నట్లు తెలిసింది.

దీంతోపాటు అపరిష్కృతంగా ఉన్న వివిధ అంశాలనూ ఆయన చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్‌జీత్‌ సింగ్‌ త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీశ్‌రావు ఆయనను కలవనున్నట్లు సమాచారం. బుధవారం కేంద్ర జలవనరుల సంఘం, అటు కేంద్ర అధికారులతో హరీశ్‌రావు సమావేశం కానున్నట్లు సమాచారం.

అయితే ప్రపంచం దృష్టాంతా హైదరాబాద్ మీద ఉంటే అంత అర్జెంటుగా మంత్రి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏంటని అందరు గుసగుసలాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే హరీష్ రావుని దూరంగా పెట్టారా? మరోవైపు కేసిఆర్ కూతురు ఎంపీ కవిత హడావిడి కూడా పెద్దగా లేదు అనే చెప్పుకోవాలి.