harish rao-ktr30 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు కేసీఆర్ పై తిరుగుబాటు బావుటా ఎగరవెయ్యబోతున్నాడని, అందరు మూకుమ్మడిగా బీజేపీలో జాయిన్ కాబోతున్నారని సోషల్ మీడియాలో ఒక వర్గం గత కొన్నిరోజులుగా ప్రచారం చేస్తుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చుపిస్తున్నారుగనుక కేటీఆర్ ను సీఎం చెయ్యడం ఖాయం, హరీశ్ కు మొండిచెయ్యే అనేది వారి విశ్లేషణ.

అయితే ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు చెప్పారు. తన పుట్టుక.. చావు కూడా తెరాసలోనేనని స్పష్టంచేశారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి తాను వచ్చానన్నారు.

తెరాసలో తాను క్రమశిక్షణ కల్గిన కార్యకర్తనని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటే తన బాట అని హరీష్ స్పష్టంచేశారు. దీనిబట్టి హరీష్ కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసినట్టే అనుకోవాలా? ఇటువంటి పుకార్లు హరీష్ పై ఎప్పటినుండో ఉన్నవి అయితే ఆయన ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చినా అవి రావడం మాత్రం ఆగట్లేదు.