Hari-Shankar-Vs-BVS-Ravi“రాజకీయం రాజకీయం… నువ్వు ఏమి చేస్తావు అంటే… ఇద్దరి స్నేహితుల మధ్య కూడా చిచ్చు పెట్టగలను…” అందట. ఇది ఓ సినిమాలోని డైలాగ్ కావచ్చు గానీ, ప్రస్తుతం ఇద్దరి సినీ సెలబ్రిటీల నడుమ ఓ పొలిటికల్ ట్వీట్ పెద్ద చిచ్చునే పెట్టింది.

‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంతో భారీ స్థాయిలో పబ్లిసిటీ దక్కించుకున్న ప్రముఖ రచయిత బివిఎస్ రవి చేసిన ఓ పొలిటికల్ ట్వీట్ కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చి రిప్లైతో ప్రారంభమైన యుద్ధం, ప్రస్తుతం వ్యక్తిగత యుద్ధంగా మారిపోయింది.

“అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే, ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది” – బీవీఎస్ రవి చేసిన ట్వీట్. ఇందుకు హరీష్ శంకర్ “అనుభవించమని ఇచ్చారా??” అంటూ రిప్లై ఇస్తూ ‘దండం’ సింబల్స్ ను పెట్టారు.

ఇక్కడితో మొదలైంది. ‘నేను వేసింది సైటైర్, దానిని ఎంజాయ్ చేయ్, దేవుడు ఆశీస్సులు ఉండాలి’ అంటూ రవి ఓపెన్ అవ్వడంతో, ‘సైటైర్ ను వివరిస్తే, అది సైటెర్ కాదు, తొందరగా కోలుకోవాలి’ అంటూ అదే స్థాయిలో హరీష్ శంకర్ కూడా రిప్లై ఇచ్చారు.

‘ఇందాకే మన నటుడు సుబ్బరాజుతో వాట్సాప్ లో అంటున్నా, అడుగు నీకు జవాబు లభిస్తుంది, పది మందిలో అంటే బాగోదు’ అంటూ రవి అని, తదుపరి ఈ ట్వీట్ ను డిలీట్ చేసారు. హేళనగా నవ్వుతూ ‘డిలీటెడ్’ నువ్వు చాలా క్విక్ లెర్నర్ బావ, అలాగే ఉండు అంటూ హరీష్ శంకర్ మరో ట్వీట్ చేసారు.

ఈ మ్యాటర్ లో నాకు వాట్సాప్ అక్కర్లేదు బావ, పది మందిలో కూడా సంస్కారవంతంగా మాట్లాడడం ‘నాకు’ వచ్చు అంటూ హరీష్ చెప్పారు.

సంస్కారం గురించి నువ్వు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది, బహుశా మొదటిసారి అనుకుంట కదా – రవి

అంతేగా ఉన్న దాని గురించి ఎక్కువ మాట్లాడను, లేని వాళ్ళ దగ్గర చెప్పడానికి తడబడను, గుడ్ గోయింగ్ బావ, కొనసాగించండి, నా వీకెండ్ ఫన్ గా ఉంది, కానీ ఖాళీ సమయంలో మాత్రమే జవాబు ఇస్తాను, రిప్లై లేట్ అయితే ఫీల్ అయ్యి మళ్ళీ వాట్సాప్ లో అందరి దగ్గర ఏడవకు – హరీష్

ఏడవడానికి కూడా ఎవడు లేని ఒంటరితనం ఉంటేనే సోషల్ మీడియా అరుగు మీద కూర్చుని ఏడవలేక నవ్వుకునే వాళ్ళని చూస్తే నవ్వు వస్తోంది, ఇట్లు భవదీయుడు బివిఎస్ రవి.

ట్వీట్స్ డిలీట్ చేసే పిరికితనం కన్నా, ఒంటరితనం బెటర్ ఏమో కదా బావ. ఓ మై గాడ్ ఏది ఏమైనా నీతో నా ఫ్లో సూపర్ బావ, తదుపరి ట్వీట్ కోసం వేచి చూస్తున్నా, కం ఆన్, అంటే నువ్వు చేసే ట్వీట్ గురించి, డిలీట్ చేసే దాని గురించి కాదు అన్న భావనను హరీష్ వ్యక్తపరిచారు.

సరిచేసుకోవడం పిరికితనం అయితే సాగతీసుకోవడం చావకబారుతనం. సూపర్ కదా పంచ్. నీతో అదే ఫెసిలిటీ. నీ మొహం చూస్తే పంచ్ పడిపోతుంది. భవదీయుడు భగత్ సింగ్ షూట్ లో కలుద్దాం పర్మిషన్ ఇస్తే – రవి.

పర్మిషన్ ఇస్తే కాదు బావ, ఆడిషన్ ఇస్తే రావొచ్చు, ఈ మధ్య “వేషాలొస్తున్నావు” కదా – హరీష్ శంకర్. ఇలా వ్యక్తిగతంగా ఒకరినొకరు ట్వీట్ చేసుకుంటూ దూషించుకున్న వైనం ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో విశేషం ఏమిటంటే… అసలు మొదలైన పొలిటికల్ ట్వీట్ ను పరిశీలిస్తే… ఇద్దరూ కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. కానీ రవి వేసిన ట్వీట్ లో ‘అనుభవించమని’ అన్న పదాన్ని హరీష్ శంకర్ ఎత్తి చూపడం రచయిత రవికి నచ్చలేదు.

దీనికి నెటిజన్లు కూడా దర్శకుడు హరీష్ శంకర్ కే సపోర్ట్ చేస్తున్నారు. ‘ప్రజా సేవ’ చేయడానికి ఇచ్చిన అధికారాన్ని, ‘అనుభవించడం’ అని ఉదహరించడం రవిదే పొరపాటని అంటున్నారు. అయితే విషయం ఇంత రచ్చ కావడానికి బహుశా వారిద్దరి మధ్య ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగత వైరం కారణం కావచ్చన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ ఫ్రైడే తెలుగు సినిమాలేవీ పెద్దగా విడుదల కాకపోవడంతో, ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరి సినీ సెలబ్రిటీల నడుమ జరిగిన ట్వీట్ల యుద్ధం సోషల్ మీడియా జనులకు వినోదాన్ని పంచుతోంది. ఇంతకీ రవి వేసిన మొదటి ట్వీట్ గానీ, హరీష్ శంకర్ ఇచ్చిన మొదటి రిప్లై గానీ ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి అయ్యిందంటారు? ఎనీ హింట్…?